Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీతో భేటీ అయిన జర్మనీ మంత్రి

ప్రధాని నరేంద్ర మోడీతో జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీయెర్ భేటీ అయ్యారు. ఆయన వెంట వచ్చిన ఉన్నత స్థాయి వ్యాపారవేత్తల బృందం కూడా మోడీతో సమావేశమైంది. ఈ సందర్భంగా పునరుత్పాదక శక్తి, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకునే అంశంపై చర్చించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. మీయెర్ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో కూడా సమావేశమయ్యారు. అంతేకాకుండా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీలతో భేటీ కానున్నారు.

More Telugu News